యూటర్న్ సమంత ప్లస్.. మైనస్

-

టైటిల్ చూసి కాస్త కన్ ఫ్యూజ్ అయ్యే అవలాశం ఉంది. గురువారం వచ్చిన యూటర్న్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత తన నటనతో అందరిని ఆశ్చర్యపరచింది. ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చిన సమంత ఫీమేల్ లీడ్ సినిమాల్లో కూడా నటించగలదని ప్రూవ్ చేసుకుంది.

ఇదిలాఉంటే సినిమాలో సమంత ప్లస్ అని చెబున్న వారెంతమందో ఆమె మైనస్ అని చెప్పే వారు ఉన్నారు. అదేంటి సినిమాలో సమంత నటనకు ప్రశంసలు అందుతున్నాయి కదా అంటే నటన పరంగా ఆమె ప్లస్సే కాని వాయిస్ పరంగా ఆమె మైనస్ అంటున్నారు. మహానటి సినిమా కోసం తెలుగు సొంత డబ్బింగ్ మొదలు పెట్టిన సమంత యూటర్న్ సినిమాకు కంటిన్యూ చేసింది.

అయితే సమంత తెలుగు డబ్బింగ్ కాస్త ఇబ్బంది పెట్టిందని అభిప్రాయపడుతున్నారు. మాత్రుభాష తమిళం కాబట్టి తెలుగులో ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో సమంత ఏం మాట్లాడుతుందో అర్ధం కానట్టుగా అనిపిస్తుందని అంటున్నారు. ఇన్నాళ్లు చిన్మయి వాయిస్ తో సమంత కనిపించగా ఇప్పుడు సొంత వాయిస్ తో సమంత కష్టపడినా లాభం లేదనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news