IPL 2023 : విరాట్ ఔట్ కాగానే.. నవీన్ పోస్ట్..ఈ సారి మాములుగా లేదుగా !

-

 

నిన్న జరిగిన మ్యాచ్‌ లో బెంగళూరు ఘోర పరాజయం పాలైంది. ముంబై, బెంగళూరు జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సగం విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బెంగళూరు జట్టు నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో మూడు ఓవర్లు మిగిలి వుండగానే చేదించింది.

దీంతో పాయింట్ల పట్టికలో 12 పాయింట్లు సాధించి గుజరాత్ టైటాన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ క తర్వాత స్థానంలో నిలిచింది. ఇది ఇలా ఉండగా, విరాట్ కోహ్లీ, లక్నో ప్లేయర్ నవీన్ వుల్ హాక్ గొడవ ఇప్పట్లో సర్దుమనిగేలా లేదు. ఇవాళ ముంబైతో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ ఒక్క పరుగుకే అవుట్ అయిన వెంటనే నవీన్ ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టారు. మామిడి పండ్లు తింటూ… ‘స్వీట్ మ్యాంగోస్’ అని క్యాప్షన్ పెట్టారు. ఇది కోహ్లీని ఉద్దేశించే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విరాట్ ఈ వివాదంపై స్పందించకపోయినా నవీన్ మాత్రం రెచ్చగొడుతూనే ఉన్నాడని ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news