పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్. కర్ణాటక ఎన్నికలలో ఇప్పటివరకు తక్కువ పోలింగ్ నమోదైన నేపథ్యంలో సుదీప్ మాట్లాడుతూ.. తాను స్టార్ కంపెయినర్ గా వెళ్లినంత మాత్రాన ఎవరు ఓట్లు వేయరని.. పౌరులుగా ప్రతిఒక్కరు బాధ్యతగా ఓటు వెయ్యాలన్నారు. ఇప్పటివరకు 21 శాతం పోలింగ్ నమోదు అయిందంటే షాకింగ్ గా ఉందన్నారు. ఓటు వేసేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక నటి రమ్య తన పాత స్నేహితురాలు అని తెలిపారు.
తనకి ఎన్నికలలో పోటీ చేయాలనే ఆలోచనలేదని.. దశాబ్దాల కాలంపాటు నటుడిగానే ఉండలనుకుంటున్నానన్నారు. రాజకీయాల్లోకి వచ్చే అనుభవం, ఆలోచన లేదని స్పష్టం చేశారు. బసవరాజ్ బొమ్మాయి కి మాత్రమే ప్రచారం చేశానని.. పార్టీకి కాదన్నారు. కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశానని తెలిపారు సుదీప్. ప్రతిఒక్కరు ఓటు హక్కు ను వినియోగించుకోవాలన్నారు. తాను సమాజానికి సందేశాలు ఇవ్వను.. కానీ ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలన్నారు. ఓటు ఎంతోమంది భవిష్యత్ ను నిర్దిషిస్తుందని.. ఓటు వేయానివాళ్ళు దాని ఫలితాన్ని అనుభవిస్తారు అన్నారు.