ఎల్‌ఐసీ సూపర్ ప్లాన్..20 ఏళ్ల ప్లాన్ కోసం ప్రీమియం చెల్లింపు 12 సంవత్సరాలు సంవత్సరాలు మాత్రమే..

-

ఎల్‌ఐసీ: ప్రముఖ ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి పాలసీలు ఎక్కువ ప్రాచుర్యం పొందాయి..ఇందులో ఎన్నో రకాల స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి…ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను విడుదల చేస్తూనే ఉంటుంది. ఈ విధంగా పోటీలో తన అగ్రస్థానాన్ని కొనసాగించడంలో ఎల్‌ఐసీ విజయం సాధించింది. ఇది జనవరి 2023 లో మార్కెట్‌లోకి వచ్చింది. అలాగే కేవలం కొన్ని నెలల్లోనే గణనీయమైన అమ్మకాలను సాధించింది. ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ నాన్-లింక్డ్ నాన్ పార్టిసిటింగ్ పాలసీ. అంటే ఇది స్టాక్ మార్కెట్‌తో అనుసంధానించని పాలసీ.. ఈ పాలసీ కి ముందుగా ఎంత ఫిక్స్ చేశారో అంతే అమౌంట్ వస్తుంది..

15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు వివిధ టర్మ్ పాలసీలను పొందవచ్చు. 8 సంవత్సరాల కంటే తక్కువ ప్రీమియం చెల్లించడం చేయవచ్చు. ఉదాహరణకు , మీరు 20 ఏళ్ల ఎల్‌ఐసి జీవన్ ఆజాద్ పాలసీని తీసుకుంటే, మీరు 12 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించాలి. ఇది 15 సంవత్సరాల పాలసీ అయితే, ప్రీమియం 7 సంవత్సరాలు మాత్రమే చెల్లించాలి.. ఇక 3 నెలల వయస్సు నుంచి 50 ఏళ్ల వయస్సు వాళ్ళ వరకు అర్హులు..పాలసీ మెచ్యూర్ అయినప్పుడు పాలసీదారుడి వయస్సు 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. 70 ఏళ్లకు మించకూడదు. 90 రోజుల పిల్లల పేరు మీద ఉన్న పాలసీ 19 లేదా 20 ఏళ్ల పాలసీలను మాత్రమే పొందవచ్చు..

ఈ పాలసీలో కనీస హామీ మొత్తం రూ. 2 లక్షలు కాగా, గరిష్ట హామీ మొత్తం రూ.5 లక్షలు. పాలసీ వ్యవధి కనిష్టంగా 15 సంవత్సరాలు. అలాగే గరిష్టంగా 20 సంవత్సరాలు అయినప్పటికీ , కేవలం ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ కాలానికి మాత్రమే ప్రీమియం చెల్లించడం ద్వారా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి..ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ పాలసీదారుడు నిర్దిష్ట కాలానికి ప్రీమియం చెల్లించిన తర్వాత ప్రమాదవశాత్తు మరణిస్తే, మరణ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంలో వారసులకు 5 % ఎక్కువ డబ్బు హామీ ఇవ్వబడుతుంది.. ఈ పథకంలో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news