కేరళలో దారుణం: చికిత్స చేస్తున్న డాక్టర్ నే చంపిన గాయపడిన వ్యక్తి … !

-

కేరళ రాష్ట్రంలో జరిగిన ఒక ఘోరం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ఘటన కొల్లం జిల్లాలో జరిగింది. కుటంబంలో తగాదాల వలన సందీప్ అనే వ్యక్తి గాయాలు పాలవ్వడంతో పోలీసులు పర్యవేక్షణలో అతనిని హాస్పిటల్ లో జాయిన్ చేయించి చికిత్సను అందిస్తున్నారు. సందీప్ కు చికిత్స చేస్తున్న డాక్టర్ వందన దాస్ (23) ను అక్కడున్న కత్తెరతో పొడిచాడు. ఈమెను అత్యవసర చికిత్స కోసమని హాస్పిటల్ కు తీసుకువెళ్లి చికిత్స చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా పోలీసులు మరియు ముందు హాస్పిటల్ లో ఉన్నవారు హతాశులయ్యారు. ఈ హత్యపై IMF హై కోర్ట్ తమ విచారాన్ని వ్యక్తం చేసింది.

పైగా ఈ కేసును హై కోర్ట్ సుమోటాగా స్వీకరించి ప్రత్యేకంగా విచారణ చేస్తోంది. మరి ఇది యాదృచ్చికంగా జరిగిందా ? లేక దీని వెనుక ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్న విషయాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news