ఐపీఎల్ 2023 : చెన్నై VS ఢిల్లీ… కీలక ఆటగాళ్లు వీళ్ళే !

-

ఈ రోజు చెన్నై వేదికగా ధోని మరియు వార్నర్ టీం ల మధ్యన కీలక పోరు జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కు చేరడానికి మరో రెండు అడుగుల దూరంలో ఉండగా, ఢిల్లీ మాత్రం ప్రతి మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు దక్కుతాయి. కాగా ఈ మ్యాచ్ లో ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు ఎవరి ఇప్పుడు చూద్దాం.

చెన్నై ఇప్పటి వరకు గెలిచిన మ్యాచ్ లలో తలో చేయి వేశారు.. కొన్ని సార్లు బ్యాటింగ్ లో ప్లేయర్స్ రాణించగా , మరొకొన్ని సార్లు బౌలర్లు అన్నీ తామై విజయాలను కట్టబెట్టారు. ఎప్పటిలాగే చెన్నై కు ఓపెనర్లు ఋతురాజ్ మరియు కాన్ వే లు చాలా కీలకం అని చెప్పాలి. ఇక వీరి బాటలోనే వేగంగా పరుగులు చేస్తూ జట్టు విజయాలలో పాలు పంచుకుంటున్న వారిలో అజింక్య రహానే మరియు శివమ్ దుబే లు ఉన్నారు. ఇక బౌలింగ్ లో జడేజా మొయిన్ అలీ మరియు తుషార్ దేశ్ పాండే లు ఆకట్టుకుంటున్నారు.

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చూసుకుంటే, మొదటి నాలుగు స్థానాలలో ఉన్న వార్నర్, సాల్ట్, మార్ష్ మరియు రాసౌ లు చాలా కీలకం. వీరు రాణిస్తే ఒంటిచేత్తో విజయాలను అందించే సత్తా వీరికి ఉంది. బౌలింగ్ లో ఇషాంత్ శర్మ, అక్షర్ మరియు కుల్దీప్ లు కీలక కానున్నారు. మరి ఈ రోజు మ్యాచ్ లో వీరు ఏ విధంగా తమ జట్లకు విజయాన్ని అందించగలరో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news