రైల్వేలో 548 ఉద్యోగాలు…టెన్త్ ప్యాస్ అయితే చాలు..!

-

ఉద్యోగాలు: మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బిలాస్‌ పూర్‌ లోని సౌత్‌ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే లో ఉద్యోగాలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దీని కోడం పూర్తి వివరాలు చూస్తే.. బిలాస్‌ పూర్‌ లోని సౌత్‌ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే ఆధ్వర్యంలోని పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయం ఈ పోస్టుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 548 అప్రెంటిస్‌ ఖాళీల ని భర్తీ చేస్తున్నారు. ఇక పోస్టుల వివరాలు చూస్తే.. ఎలక్ట్రీషియన్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌, టర్నర్‌, వైర్‌మ్యాన్‌, గ్యాస్‌కట్టర్‌, ఫిట్టర్‌, పెయింటర్‌, ప్లంబర్‌, మెకానిక్‌, ఫొటోగ్రాఫర్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు వున్నాయి.

ఇక ఖాళీల వివరాలు చూస్తే.. మొత్తం ఖాళీలు: 548 వున్నాయి. అన్‌ రిజర్వ్‌డ్‌: 215, ఈడబ్ల్యూఎస్‌: 59, ఓబీసీ: 148, ఎస్సీ: 85, ఎస్టీ: 41 వున్నాయి. ఈ పోస్టుల కి దరఖాస్తు చేసుకోవాలి అంటే 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి 10+2/ ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చెయ్యాలంటే 15-24 ఏళ్లు ఉండాలి. అప్రెంటిస్‌షిప్‌ కాలవ్యవధి వచ్చేసి ఏడాది గా వుంది. అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చివరి తేది జూన్‌ 03, 2023. పూర్తి వివరాలను https://secr.indianrailways.gov.in/ లో చూసి అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news