ఆర్టీసీ సమ్మెపై విచారణ15కు వాయిదా

-

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున న్యాయవాది రామచందర్‌ రావు, ఆర్టీసీ యాజమన్యం, కార్మిక సంఘాల తరఫున న్యాయవాది రచనా రెడ్డి వాదించారు. ఇరు పక్షాలు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి. సమ్మె ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై కార్మిక సంఘాలు వివరణనిచ్చాయి.

 

సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కార్మిక సంఘాల తరపు న్యాయవాది.. సమ్మెను విరమించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు… పూర్తి వివరాలతో మరోసారి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news