బీచ్‌లు.. పార్కులు.. ద్వీపాలు.. సరస్సులతో.. కొల్లం రోడ్‌ ట్రిప్‌ ఓ అద్భుతం!

-

ఏదైనా ఒక ప్రదేశం అంటే బీచ్‌ ఉంటుంది. లేదా పార్కులు, ద్వీపాలు ఉంటాయి. వీటితో పాటు సరస్సులు కూడా ఉండాలంటే.. ఇలాంటి ప్రదేశం ఎక్కడా ఉండదని నిక్కచ్చిగా చెబుతారు. అలాంటి ప్రాంతం ఉంది. అది ఎక్కడో తెలుసా? కొల్లా.. ఇది కేరళ రాష్ట్రంలోని ప్రముఖ తీర ప్రాంతం. ఇక్కడ రుచికరమైన సముద్రపు ఆహారం యాత్రికులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఎక్కువగా జీడిపప్పు పండిస్తారు. అందుకే దీనికి ‘జీడిపప్పు నగరం’ అని పిలుస్తారు. నార పరిశ్రమ కూడా ఈ జిల్లాలో బాగా ప్రాచూర్యంలో ఉంది. కొల్లాం ప్రముఖ బీచ్‌ పట్టణమైన వర్కాల నుంచి 23 కి.మీ. దూరంలో తిరువనంతపురం నుంచి 60 కి.మీ. దూరంలో కలదు. వ్యాపారానికి సంస్కృతికి పేరెన్నిక గలది కొల్లాం. ప్రాచీన కాలం నుంచి ఈ ప్రాంతం సంబంధాల చురుకుగా కొనసాగిస్తూ వస్తున్నది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది.

అష్టముడి సరస్సు

కొల్లాంను సందర్శించే ప్రతి పర్యాటకుడు తప్పకుండా అష్టముడి సరస్సును చూడలసిందే.. ఈ సరస్సులోని విమారం, ఊగిసలాడే కొబ్బరి చెట్ల మధ్య, తాటి చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ఉంటుంది.

హౌస్‌ బోట్‌ ప్రయాణం :
అష్టముడి సరస్సులో పడవ ప్రయాణం బహుశా ఏ పర్యాటకుడు వదులుకోడు. పర్యాటకుడు తన బడ్జెట్‌ బట్టి, అనుకూలతను బట్టి హౌస్‌ బోట్‌లను ఎంపిక చేసుకోవచ్చు. హౌస్‌ బోట్‌ పడక గదలు, కిచెన్‌, బాల్కనీ వంటి వసతులు కలిగి ఉంటుంది.

తేవల్లి ప్యాలెస్‌ :

కొల్లాం పట్టణానికి 25 కి.మీ. దైరంలో ఉన్న తేవల్లి ప్యాలెస్‌ ఒక వారసత్వ భవనం అని చెప్పవచ్చు. దీని నిర్మాణం బ్రిటీష్‌, పోర్చుగీస్‌, డచ్‌ నిర్మాణ శైలిని పోలి ఉండి యాత్రికులను ఆకట్టుకుంటున్నది. అష్టముడి సరస్సు నుంచి హౌస్‌ బోట్‌ పడవల్లో ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు.

 

జటాయుపర, కొల్లం..

కేరళ ఎన్నో రకాల పర్యాటక పధకాల అమలులో చాలా అభివృద్ధి చెందినది. ఏడాది పొడవునా దేశవిదేశాల పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఈ క్రమంలో స్థానిక, దూర ప్రాంత సందర్శకులను ఆకర్షించేందుకు రూపుదిద్దుకున్న మరో పథకమే జటాయు పర. పట్టణానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సీతా దేవిని అపహరించుకొని పోతున్న రావణాసురుని జటాయువు అడ్డుకొని, విరోచిత పోరాటం జరిపి అసువులు బాసినదని స్థానిక గాధ.

 

మన్రో ద్వీపం

కొల్లాం పట్టణానికి 27 కి.మీ దూరంలో ఉన్న మన్రో ద్వీపం 8 చిన్న చిన్న ద్వీపాల సమూహం. ఇక్కడికి రోడ్లు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. బర్డ్‌ వాచింగ్‌, చేపలు పట్టడం వంటివి ఇక్కడ చేయవచ్చు. ద్వీపంలో ఆలయాలు, చర్చిలకు పడవల్లో ఎక్కి చూసి రావచ్చు.

సస్తంకొట్ట సరస్సు

కొల్లాంకి 25 కి.మీ. దూరంలో ఉన్న సస్తంకొట్ట సరసుస దృశ్య పరమైన సౌందర్యం వల్లా.. పడవ ప్రయాణ సౌకర్యాల వల్లా పర్యాటకులని ఆకర్షిస్తున్నది. దీనికి ఆ పేరు సరస్సు ఒడ్డున ఉన్న ‘సాస్థ’ దేవుడి గుడి నుంచి వచ్చింది. సరస్సు చుట్టూ ఉన్న అద్భుతమైన కొండల వల్ల ఈ ప్రాంతం మరింత అందంగా చూపరులను కనువిందు చేస్తున్నది.

కొల్లాం బీచ్‌

కొల్లాంకు 2 కి.మీ. దూరంలో ఉన్న ఈ బీచ్‌కు మరోపేరు మహాత్మా గాంధీ బీచ్‌. ఈ బీట్‌లో ఇసుక తీరాలు తప్పక చూడాలి. సందర్శకులు సాయంత్రం వేళ ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా, నిర్మలంగా ఉండే బీచ్‌ పరిసరాల్లో తిరుగుతూ పునరుత్తేజం పొందుతారు. బీచ్‌ ఒడ్డున ఒడ్జెట్‌లోపే హోటళ్లు, రిశార్ట్‌లు లభించవచ్చు.

తిరుముల్లవరం బీచ్‌

కొల్లాంకు 6 కి.మీ. దూరంలో ఉన్న తిరుముల్లపురం బీచ్‌లో సముద్రపు అలల శబ్దం తప్పనిచ్చి వేరే ఏ ఇతర శబ్దాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. బీచ్‌లో నీళ్ళు అంత లోతులేని కారణంగా స్విమ్మింగ్‌ చేయడానికి కుటుంబ విహార యాత్రలకి అనువైనదిగా చెప్పుకోవచ్చు.

తంగస్సేరి బీచ్‌

కొల్లాంకు 5 కి.మీ. దూరంలో ఉన్న తంగస్సేరి బీచ్‌ సేదరీరడానికి, రిలాక్స్‌ అవడానికి సరైన స్పాట్‌ 144 అడుగుల ఎత్తు గల పాత లైట్‌ హౌస్‌ ఈ బీచ్‌లోని ప్రదాన ఆకర్షణ. ఈ లైట్‌ హౌస్‌లోకి మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 వరకు సందర్శకులని అనుమతిస్తారు. బీచ్‌ సమీపంలో పోర్చుగీసు కోట శిథిలాలు అనేక చర్చ్‌లున్నాయి.

అడ్వెంచర్‌ పార్క్‌

కొల్లాం పట్ణణానికి 3 కి.మీ. దూరంలో అష్టముడి సరస్సుకు ఒడ్డున ఉన అడ్వేంచర్‌ పార్క్‌ పిల్లలకే కాదు, పెద్దలకూ కూడా వివిధ రకాల క్రీడలను అందిస్తుంది. వివిధ రకాల బోట్‌లు అద్దెకు తీసుకొని 48 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్క్‌లో తిరుగుతూ ఆనందించవచ్చు. పెయింటింగ్‌లతో కూడిన మ్యూజియం కూడా చూడవచ్చు.

అంచెంకాయిల్‌

దట్టమైన అడవులు, గడుపలు, జలపాతాలు ఉండే ప్రదేశం కొల్లాంకు 60 కి.మీ. దూరంలో కలదు. ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయం ప్రధాన ఆకర్షణ. పండగలు, ఉత్సవాల సమయాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆలయానికి దగ్గర్లో కుభవురుట్టి జలపాతం, మనలార్‌ జలపాతం రెండూ సందర్శకులను కనువిందు చేస్తాయి.

రామేశ్వర గుడి

కొల్లాం నగరానికి 10 కి.మీ. దూరంలో ఉన్న రామేశ్వర గుడి అద్భుతమైన నిర్మాణం, మ ంత్రముగ్దుల్ని చేసే శిల్పాలతో వందలాది మంది సందర్శకుల్ని ఆకర్షిస్తోంది. ఆలయ ముఖ్య ఆకర్షణ పౌరాణిక రాక్షసుడు వ్యాల యొక్క పద్దె శిల్పాలు. ఈ పెద్ద శిల్పాలు గుడికి ఒక ప్రాచీనత్వాన్ని ఇస్తున్నాయి.‚

అమృతపురి

కొల్లాంకు 30 కి.మీ దూరంలో ఉన్న వల్లికాపు ప్రాంతంలో ఏర్పడ్డ ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం అమృతపురి. మాతా అమృతానందమయి జన్మస్థానమైన ఈ ప్రాంతంలో ఆశ్రమాలు, విద్యాసంస్థలు, రీసర్చ్‌ కేంద్రాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి. కొల్లాం నుంచి పడవల్లో అమృతపురి చేరుకోచ్చు.

మయ్యనాడ్‌

మయ్యనాడ్‌ గ్రామం కొల్లాంకు 10 కి.మీ. దూరంలో ఉంది. సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇక్కడి ప్రధాన మత కేంద్రంగా ఉన్నది. అరేబియా సముద్రంలో చేపలు పట్టే తీరు పార్యాటకులను వావ్‌ అనిపిస్తుంది.

పండుగలు, ఉత్సవాలు

ఏటా లక్షలాది మంది పర్యాటకులను అకర్షించే కొల్లాంలో హస్త కళా ఉత్సవాలు, పడవ రేసులు, ఏనుగు ఉత్సవాలు, అష్టమి రోహిణి, ఓనంలు జరుపుకుంటారు. కంచె పోరాటం, ఎద్దుల పోటీలు పారిప్పల్లి గజమేళాలు సైతం ఆకర్షిణీయంగా నిలిచాయి.

కొల్లాం ఎలా చేరుకోవాలి?

కొల్లాం చేరుకోవడానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు సులభంగా లభిస్తాయి. వాయు మార్గం కొల్లాంకు 70 కి.మీ. దూరంలో తిరువనంతపురం విమానాశ్రయం కలదు. ఇక్కడికి దేశ విదేశాల నుంచి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ట్యాక్సీ, క్యాబ్‌ల ద్వారా కొల్లాం చేరుకోవచ్చు. రైలు మార్గం కొల్లాం రైల్వే స్టేషన్‌ దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో కలుపబడి ఉంది. చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం, కొచ్చిన్‌, కన్యాకుమారి తదితర నగరాల నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు మార్గం కొల్లాం గుండా 3 జాతీయ రహదారులు వెళుతాయి. చెన్నై. తిరువనంతపురం. కొచ్చిన్‌, కన్యాకుమారి, కోయంబత్తూర్‌, పాండిచ్చేరి, కొట్టాయం, ఎర్నాకులం నుంచి బస్సులు నిత్యం నడుస్తుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news