4 ఏళ్లలో రూ. 4,42,442 కోట్ల అప్పులు చేశామని సీఎం స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ ప్రకటన చేశారు. ప్రభుత్వ అప్పు ఎంత అనేది ప్రశ్నార్థకమే కాదు.. వెబ్ సైట్లల్లో అందుబాటులో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగే సమయానికి రిజర్వ్ బ్యాంకు నివేదిక ప్రకారం రూ. 1,96,202 కొట్లుగా ఉందని వివరించారు.
ఈ నాలుగేళ్ల లో రూ. 4,42,442 కోట్ల రుణాలు ఉన్నట్టు ఆర్బీఐ చెప్పింది…ఇక ప్రభుత్వ హామీ ఇచ్చే రుణాలు తీసుకున్న కార్పొరేషన్లు తీసుకున్న అప్పు రూ. 1,44,875 కోట్లు రుణం ఉందని వెల్లడించారు. అందులో విద్యుత్ సంస్థల రుణమే రూ. 45 వేల కోట్లు ఉంది… అప్పు చేయాలంటే ఏ రాష్ట్రమైనా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, లేదా బాండ్లు ద్వారా రుణం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన సమాచారం మేరకు కేంద్రం ఇచ్చిన వివరాలు ప్రకారం కూడా ఏపీ అప్పు తక్కువే ఉంది…ఏదో గుప్త రుణాలు ఉన్నట్టు ప్రతిపక్షాలు యాగి చేస్తున్నాయని మండిపడ్డారు సీఎం స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ.