సిబిఐ: ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దు !

-

ఏపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం సిబిఐ కస్టడీ లో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఉదయ్ కుమార్ రెడ్డి తరపున న్యాయవాదులు బెయిల్ ఇవ్వాల్సిందిగా పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై ఈ రోజు సిబిఐ కోర్ట్ లో వాదోపవాదాలు జరిగాయి. కాగా ఉదయ్ కుమార్ రెడ్డు తరపున న్యాయవాదులు బెయిల్ ఇవ్వాలని కారణాలు చెబుతున్నా… సిబిఐ మాత్రం అతనికి ఎటువంటి పరిస్థితిలో బెయిల్ ఇవ్వొద్దని కోర్ట్ ను కోరింది. ఒకవేళ బెయిల్ ఇస్తే ఈ కేసులో ఉన్న సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు అంటూ వాదించింది. ఈ హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి ప్రమేయం ఉందని ఆధారాలను సేకరించిన తర్వాతనే అరెస్ట్ చేయడం జరిగిందని కోర్టుకు సిబిఐ తెలిపింది.

కాగా ఈ వాదోపవాదనలను విన్న సిబిఐ కోర్ట్ తీర్పును ఈ నెల 15కు వాయిదా వేసింది. కాగా ఈ వాదనల్లోనే సిబిఐ మరోసారి ఇందులో ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా ప్రమేయం ఉందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news