ఈ ఊర్లో అమ్మవారికి శిరస్సు ఉండదు.. పైగా నీళ్ళని మొక్కుకుంటే చాలు..!

-

కొన్ని కొన్ని ఆలయాలు ఎంతో వెరైటీగా ఉంటాయి వాటి వెనుక కథను చూస్తే షాక్ అవుతూ ఉంటారు. కొన్ని కొన్ని ఆలయాల గొప్పతనం కానీ ఆలయం వెనక దాగి ఉన్న రహస్యం కానీ తెలిస్తే మనం ఆశ్చర్యపోతూ ఉంటాము. అలాంటి ఆలయం గురించి ఈరోజు మేము పరిచయం చేయబోతున్నాము. ఇక్కడ ఉన్న అమ్మవారికి శిరస్సు ఉండదు. పైగా ఇక్కడ అమ్మవారికి నీళ్ళని సమర్పిస్తూ ఉంటారు. నిజానికి ప్రతి గుళ్లో అమ్మవారికి లేదంటే ఏ దేవుడు అయితే ఆ దేవుడికి శిరస్సు నుండి పాదాలదాకా రూపం ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో కొలువైన ఈ అమ్మవారి విగ్రహానికి శిరస్సు ఉండదు శిరస్సు స్థానంలో ఓంకారం అనే రూపంలో దర్శనమిస్తుంది ఈ అమ్మవారు. పాదాలు దగ్గర ఈ అమ్మవారి శిరస్సు ఉంటుంది. ఈ అమ్మవారికి కేవలం బిందెడు పసుపు నీళ్ళని సమర్పిస్తే చాలు భక్తులు కోరికలు తీరిపోతాయి. ఈ ఆలయం పేరు శ్రీ ఎరుకమాంబ ఆలయం. విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం సమీపంలోని దొండపర్తి లో వెలసిన శ్రీ ఏరుకుమాంబ అమ్మవారుకి శిరస్సు ఉండదు.

శిరస్సు స్థానంలో ఓంకారం ఉంటుంది ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారి వెనక శ్రీ చక్రం ఉందని భక్తులు అంటారు. ఈ అమ్మవారిని గౌరవ స్వరూపంగా భావిస్తారు. గౌరీ స్వరూపమైన ఈ అమ్మవారి విగ్రహాన్ని ఎద్దుల బండిమీద నుండి తీసుకువచ్చేటప్పుడు అది ఆగిన చోట అమ్మవారికి ఆలయం కట్టాలని అప్పటి పెద్దలు నిర్ణయించుకున్నారట. ఆ సమయంలోనే అమ్మవారి విగ్రహం నుండి శిరస్సు వేరుగా పడింది.

అలా వేరుపడిన శిరస్సు అతికించేందుకు ప్రయత్నం చేసినా కుదరలేదు ఆ సమయంలో భక్తులు అమ్మవారిని వేడుకొనగా కాళ్ల దగ్గర శిరస్సు పెట్టి కంఠం దగ్గర పసుపు నీళ్లు పోస్తే చాలు అమ్మవారి ఆశీస్సులు పొందొచ్చు అని భక్తులు చెప్పారు. అప్పటినుండి కూడా అక్కడికి వెళ్లే వాళ్ళు బిందెడు నీళ్ళని సమర్పించుకుంటూ ఉంటారు. మొక్కుని తీర్చుకుంటూ ఉంటారు బుధవారం నాడు పవిత్రమైన పసుపు నీళ్లని ఎవరైతే అమ్మవారికి సమర్పిస్తారో వాళ్ళు కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం.

Read more RELATED
Recommended to you

Latest news