BREAKING : శ్రీవారి భక్తులకు శుభవార్త..దర్శన, వసతి గదుల కోటా క్యాలెండర్‌ విడుదల

-

BREAKING : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. దర్శన, వసతి గదుల కోటా క్యాలెండర్‌ విడుదల అయింది. తిరుమల ఆన్ లైన్ లో దర్శన, వసతి గదులు కోటా విడుదలకు సంభంధించిన క్యాలండర్ ని విడుదల చేసింది టీటీడీ పాలక మండలి.

ఈ క్యాలెండర్‌ ప్రకారం… ప్రతి నెల 18వ తేది నుంచి 20 వ తేది వరకు లక్కిడిఫ్ విధానంలో ఆర్జిత సేవా టిక్కేట్లు విడుదల చేయనునన్నారు. 21వ తేదిన వర్చువల్ సేవా టిక్కేట్లుతో పాటు నేరుగా బుక్ చేసుకునే సేవా టిక్కేట్లు విడుదల చేయనున్నారు. 23వ తేదిన శ్రీవాణి, అంగప్రదక్షణం, వయోవృద్దులు, వికలాంగుల దర్శన టిక్కేట్లు విడుదల చేయనున్నారు. 24వ తేదిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. 25వ తేదిన వసతి గదులు కోటా విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Latest news