త్వరలోనే అహ్మదాబాద్, రాయపూర్ లో తిరుమల శ్రీవారి దేవాలయం ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ఇఓ దర్మారెడ్డి ప్రకటన చేశారు. అలిపిరి నడకమార్గంలో వచ్చే భక్తులుకు తిరుపతిలోని భూదేవి కాంప్లేక్స్ వద్ద టోకేన్లు జారి చేస్తున్నామని వెల్లడించారు ఇఓ దర్మారెడ్డి. సర్వదర్శన భక్తులుకు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజస్వామి సత్రాలు వద్ద టోకేన్లు జారి చేస్తూన్నామని వివరించారు.
శ్రీవారి భక్తులును మోసగిస్తూన్న 52 నకీలి వెబ్ సైట్లు,13 మొబైల్ యాప్ లు పై పోలిసులుకు ఫిర్యాదు చేసాం… రంపచోడవరంలో మే 17 నుంచి 22వ తేది వరకు మహసంప్రోక్షణ నిర్వహిస్తామని వివరించారు ఇఓ దర్మారెడ్డి. జమ్ములో జూన్ 8 నుంచి మహసంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. కపిలతీర్దంలోని నరశింహ స్వామి ఆలయంలో 14వ తేది వరకు మహసంప్రోక్షణ కార్యక్రమాని నిర్వహిస్తూన్నామని.. త్వరలోనే అహ్మదాబాద్, రాయపూర్ లో శ్రీవారి ఆలయాల నిర్మాణం ప్రారంభిస్తామని ప్రకటన చేశారు ఇఓ దర్మారెడ్డి.