వీకే నరేష్ ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

-

ప్రముఖ నటుడు , హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వీకే నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఇకపోతే నిర్విరామంగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న ఈయన గత కొద్ది రోజులుగా వ్యక్తిగత విషయంలో వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. సహనటి పవిత్ర లోకేష్ తో సహజీవనం, పెళ్లి అంటూ వార్తలు వినిపించడం.. మరొకవైపు రంగంలోకి ఆయన మూడో భార్య రమ్య రఘుపతి ఎంట్రీ ఇవ్వడం అన్నీ కూడా పలు వివాదాలకు దారితీస్తున్నాయి.

మరొకవైపు అందుకు తగ్గట్టుగా వీకే నరేష్ ప్రవర్తన కూడా కుటుంబ సభ్యులను మరింత ఇబ్బంది పెడుతోందని చెప్పాలి. ఇటీవలే ఆయన కొడుకు నవీన్ విజయ్ కృష్ణ కూడా పవిత్ర తో చేసే పనుల వల్ల తాము సిగ్గుతో తలదించుకుంటున్నామని, అందుకే బయట కూడా తిరగలేకపోతున్నామని మీడియా ముందు వెల్లడించిన విషయం తెలిసిందే. అయినా కూడా వీకే నరేష్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇప్పుడు మళ్ళీ తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా మళ్లీ పెళ్లి అనే సినిమాను కూడా తీస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయన దగ్గర ఎంత ఆస్తి ఉంది అనే వార్తలు ఇప్పుడు మరింత వైరల్ అవుతున్నాయి. ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆయనకు అటు తల్లి విజయనిర్మల నుంచి ఇటు తండ్రి కృష్ణా నుంచి కొన్ని వందల కోట్ల ఆస్తి వచ్చినట్లు సమాచారం. అలాగే ఆయన కూడా సినిమాలలో నటించి బాగానే సంపాదించారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు లక్షల్లో పారితోషకం తీసుకుంటున్నారు. తనకు సొంతంగా కేరవాన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇకపోతే ఆయన స్థిరాచర ఆస్తుల విలువ మొత్తంగా రూ. 1000 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.. ఏది ఏమైనా నరేష్ ఆస్తుల విలువ తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news