చంద్రబాబుపై క్విడ్ ప్రోకో కేసులో నస తప్ప… పస లేదు – వైసీపీ ఎంపీ

-

చంద్రబాబుపై క్విడ్ ప్రోకో కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఇష్యూపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. ఇంతటి న్యూ సెన్స్ ప్రభుత్వం భారతదేశంలో మరొకటి లేదని, భవిష్యత్తులో రాదని, ఈ ప్రభుత్వ పెద్దలపై ఎన్నో క్విడ్ ప్రోకో కేసులు ఉన్నాయని, ప్రతి దాంట్లో తాను వెధవ పనులు చేసినట్లుగానే వీళ్ళు ఎందుకు చేసి ఉండరన్న మీ మాంసతోనే ప్రధాన ప్రతిపక్ష నేతపై క్విడ్ ప్రోకో కేసు నమోదు చేశారని అన్నారు.

ఈ కేసులో నస తప్ప… పస లేదని, వేసవి సెలవుల ప్రత్యేక కోర్టు ఈ కేసును కొట్టి వేసే అవకాశం ఉందన్నారు. కాగా, జిల్లాల వారీగా ఇసుక టార్గెట్లను విధించి జగన్ మోహన్ రెడ్డి గారు అండ్ కంపెనీ సొమ్ము చేసుకుంటుందని, ఏ జిల్లాకు ఆ జిల్లాకు ప్రత్యేక టార్గెట్లను నిర్దేశించిందని, గుంటూరు జిల్లాకు 20 కోట్ల రూపాయలను టార్గెట్ గా విధించిందని, ఇసుక విక్రయాల వసూళ్లను పెదకూరపాడు ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఇసుక విక్రయ టార్గెట్లను గతంలో ప్రేమ్ రాజ్ అనే వ్యక్తికి కట్టబెట్టగా, తాడేపల్లి ప్యాలెస్ కు కప్పం కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రస్తుతం సుధీర్ అనే వ్యక్తి ఆ వ్యవహారాలను చక్కబెడుతూ, ప్యాలెస్ కు కప్పం కడుతున్నాడని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news