గ్రాండ్ మాస్టర్ ప్రణీత్ కు కేసీఆర్ ప్రశంస.. బహుమానంగా 2.5 కోట్లు

-

చిన్న వయస్సులోనే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన రాష్ట్ర చెస్ క్రీడాకారుడు.. ఉప్పల ప్రణీత్(16) వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్ హోదాకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రణీత్​ విజయం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రణీత్, తల్లిదండ్రులను సచివాలయం పిలిపించుకున్న సీఎం… ప్రణీత్ కు శిక్షణ ఇప్పించి, గొప్పగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను అభినందించారు. భవిష్యత్ లో ప్రణీత్ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, తెలంగాణకు, దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ప్రణీత్ సూపర్ గ్రాండ్ మాస్టర్ గా ఎదిగేందుకు కావాల్సిన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రెండున్నర కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎంకు.. ప్రణీత్ తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. వరల్డ్ చెస్ ఫెడరేషన్ ద్వారా.. ‘ఉమన్ క్యాండిడేట్ మాస్టర్ గా గుర్తింపు పొందిన 19 ఏళ్ల వీర్లపల్లి నందినిని కూడా కేసీఆర్ అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో కీర్తిశిఖరాలు అధిరోహించేందుకు అవసరమైన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం….. 50 లక్షల రూపాయలను సీఎం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news