దిగజారిన జర్నలిజానికి ఇది పరాకాష్ట అని ఆంధ్రజ్యోతి వార్తపై అజయ్ కల్లాం కౌంటర్ ఇచ్చారు. వివేకానంద రెడ్డి గుండె పోటు తో చనిపోయారని సీఎం జగన్ చెప్పారని నేను చెప్పానని వార్త రాశారు..దిగజారిన జర్నలిజానికి ఇది పరాకాష్ట అని ఆగ్రహించారు. కొంత కాలం కిందట సీబీఐ ఎస్పీ ఒకాయన నన్ను కలిశారు..ఆయన ఐదు నిమిషాలు మాట్లాడాలని నాకు మెసేజ్ చేశారన్నారు.
రమ్మని ఆహ్వానించాను.. 161 స్టేట్ మెంట్ కు ఎవిడెన్స్ విలువ ఉండదని తెలిపారు అజయ్ కల్లాం. దాని పై సంతకాలు తీసుకోరు… ఇలాంటి వార్తలను ఖండించకపోతే సీబీఐ విశ్వసనీయతే దెబ్బ తింటుందని పేర్కొన్నారు. సీబీఐకి చెప్పే విషయాలను లీక్ చేయటం అనైతికం, చట్ట విరుద్ధం…అవసరమైతే న్యాయపరంగా కూడా వెళతామని హెచ్చరించారు అజయ్ కల్లాం. 161 నోటీసు అంటే ఏంటో కూడా ఎవరికి తెలియదు.. దీనిలో వీడియో, ఆడియో రికార్డింగ్ ఏమీ ఉండదని పేర్కొన్నారు. సమాచారం ఇవ్వటం మాత్రమే ఉంటుంది.. సీబీఐ లీక్ పేరుతో తప్పుడు కథనాలు రాసి ఉండవచ్చన్నారు అజయ్ కల్లాం.