సీనియర్ ఎన్టీఆర్ పై విజయశాంతి ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ 100 సంవత్సరాల వేడుక సందర్భంగా హైదరాబాదులోని ఇవాళ్టి కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా అభిప్రాయపడుతున్నానని తెలిపారు. ఆ శతాబ్ది ఉత్సవాలకు నన్ను ఆహ్వానించిన అందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు.
నన్ను ఎంతో గౌరవించి… అమ్మా అని ఆదరాభిమానాలతో పిలుస్తూ, సమాజంపై కళాకారుల బాధ్యతను ప్రజాప్రాయోజిత చిత్రాలతో మరింత ఉన్నతస్థాయిలో మీరు నిలబెట్టగలరని ఆశీర్వదిస్తూ అభినందించి, కళ సమాజం కోసం, పేదవారి ప్రయోజనం కోసం… అని ఎన్టీఆర్ గారు చెప్పిన, స్ఫూర్తినిచ్చిన ఆ భావం అన్నారు విజయశాంతి. ఎమ్జీఆర్ గారు, ఎన్టీఆర్ గారు వంటి ఎందరో సినిమా నుండి వచ్చిన నేతలు, భవిష్యత్ తరాలకు నిజాయితీతో నేర్పిన విధానాలు, తప్పనిసరిగా సినిమా కళాకారులం నిత్యసత్యాలుగా నమ్మి తీరుతామని స్పష్టం చేశారు విజయశాంతి.