జూనియర్ ఎన్టీఆర్ కు మెగాస్టార్ బర్త్ డే విషెస్…

-

ఈ రోజు టాలీవుడ్ నుండి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన మన అందరి మనిషి జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. నిన్నటి నుండే రెండు తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్స్ తన పుట్టినరోజుని ఎంతో ఘనంగా జరపడానికి ఏర్పాట్లు చేశారు. గత రాత్రి నుండి సోషల్ మీడియా వేదికగా విషెస్ ను తెలుపుతున్నారు. కాగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలియచేయడం విశేషం. సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి “అద్భుతమైన ప్రతిభ కలిగిన ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు… భగవంతుడు ఆయురారోగ్యాలు , సంతోషం అందించాలని కోరుతున్నాను” అంటూ ఒక సందేశాన్ని పంచుకున్నాడు. కాగా నిన్ననే ఎన్టీఆర్ కొత్త మూవీ టైటిల్ “దేవర” ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

వీర మాస్ లోక్ లో ఉన్న ఎన్టీఆర్ ను చూస్తే ఇక బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపిస్తోంది. ఈ సినిమాకు కొరత శివ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు, ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో జనతా గారేజ్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news