ఉక్రెయిన్ మరియు రష్యా దేశాల మధ్యన రెండు సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూనే ఉంది. యుక్రెయిన్ ను ఎలాగైనా హస్తగత చేసుకోవాలి అనుకుంటున్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్ని మార్గాలను వాడుతున్నాడు. ఇక రష్యా కన్నా అన్ని అంశాలలో బలహీనంగా ఉన్న ఉక్రెయిన్ సాధ్యమైనంత వరకు తమ శాయశక్తులా పోరాడుతోంది. ఈ యుద్ధం నుండి బయటపడడానికి లేదా ఆపడానికి అన్ని దేశాల అధ్యక్షులను అడుగుతోంది. తాజాగా జపాన్ హిరోషిమా జీ 7 దేశాల సదస్సులో పాల్గొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి భారత్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని మోదీ జెలెన్ స్కి తో ఈ యుద్దాన్ని ఆపడానికి మేము గట్టిగా ప్రయత్నిస్తాము అన్నాడు.
యుద్ధం వలన మీ రెండు దేశాలకే సమస్య కాదని.. ఇది రానున్న రోజుల్లో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందన్నారు. యుద్ధం వలన ఆర్ధికంగానే నష్టం కాదు.ఇది ప్రపంచంలోని మనవాళిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందన్నారు.