నిర్మల్ జిల్లాలో అధికార పార్టీ బీఆర్ఎస్ వర్గపోరు బయటపడింది.మున్సిపల్ ఛైర్మన్ మరియు దళిత సంఘ నాయకుడు మధ్య వివాదం రాజుకుందని తెలుస్తోంది. అంబేద్కర్ భవనాన్ని మున్సిపల్ ఛైర్మన్ సందర్శించారు.అయితే దానిని సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఛైర్మన్ కు, దళిత సంఘ నేతకు మధ్య వివాదం చెలరేగింది. అయితే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎదుటే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఆయన విచారణ చేసేందుకు కొత్త కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
తమ సామాజిక వర్గం జనాభా ఎక్కువగానే ఉందని, తమ నుంచి ఒక కమిటీ వేసి నిర్వహణ బాధ్యతలు తమకు అప్పగించాలని సూచించారు. భవన నిర్మాణ సమయంలో పర్యవేక్షణ లోపంతో తమకు ఇష్టం వచ్చిన రీతిన నిర్మించాడని, ఫలితంగా నాణ్యత లోపం ఏర్పడుతోందని మండిపడ్డారు. మీ అంబేద్కర్ భవనం ఎటు వెళ్లిది అని పలు గ్రామాల ప్రజలు అడుగుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భవనం ఎటు వెళ్లలేదని, సమావేశం ఏర్పాటు చేసి కమిటీ కి అప్పగిద్దామని మంత్రి చెప్పుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.