ఐపీఎల్ 16వ సీజన్ చివరి ఘట్టానికి చేరువలో ఉంది. ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెన్నై సారధి ఎంస్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘కెప్టెన్.. లీడర్.. లెజెండ్.. ఎంఎస్ ధోనీ ఓ ఎమోషన్’ అంటూ గుజరాత్ టైటాన్స్ ట్విటర్ ఖాతాలో ఓ స్పెషల్ వీడియోను పోస్టు చేసింది.
‘చాలా మంది ధోనీ సీరియస్‌గా ఉంటాడని అనుకుంటారు. నేనైతే మహీతో చాలా సరదాగా ఉంటాను. జోక్‌లు వేస్తాను. ధోనీలాగా ఎప్పుడూ అతడిని చూడను. నిజంగా నేను చాలా విషయాలు ధోనీ నుంచి నేర్చుకున్నాను. అతడితో ఎక్కువగా మాట్లాడకపోయినా.. కేవలం చూస్తూనే చాలా సానుకూల అంశాలు నేర్చుకున్నా. నాకైతే మహీ బెస్ట్ ఫ్రెండ్, ప్రియమైన సోదరుడు. అతడితో చిలిపి పనులు చేసేవాడిని. ఇక నేనెప్పుడూ ధోనీ అభిమానినే. అతడికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ధోనీని ఎవరైనా ద్వేషించాలంటే.. వారు చాలా క్రూరులై ఉండాలి’ అంటూ సరదాగా స్పందించాడు హార్దిక్.
Captain. Leader. Legend.@msdhoni is an emotion 💙 Here’s a special tribute from @hardikpandya7 to the one and only Thala ahead of a special matchday in Chennai! 🤝#GTvCSK | #PhariAavaDe | #TATAIPL Playoffs 2023 pic.twitter.com/xkrJETARbJ
— Gujarat Titans (@gujarat_titans) May 23, 2023