దగ్గు మందు ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

-

దగ్గు మందు ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. భారత్‌లోని కొన్ని కంపెనీలు తయారుచేసిన దగ్గు మందుల కారణంగా కొన్ని దేశాల్లో మరణాలు సంభవించడం ఇటీవల తీవ్ర ఆందోళనలకు దారితీసిన విషయం తెలిసిందే. ఆ సిరప్‌లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవల హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దగ్గు సిరప్‌లకు ప్రభుత్వ ల్యాబ్‌లలో అనుమతి తప్పనిసరి చేసింది. ఆ తర్వాతే ఎగుమతులు చేసుకోవాలని స్పష్టం చేసింది. జూన్‌ 1 నుంచి ఈ నూతన నిబంధనలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.

‘‘దగ్గు మందు ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ఏదైనా ప్రభుత్వ లాబొరేటరీలో పరీక్షించి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్‌ సమర్పిస్తేనే తమ దగ్గు మందులను ఎగుమతి చేసేందుకు అనుమతులు లభిస్తాయి. జూన్‌ 1వ తేదీ నుంచి ఈ నిబంధన తప్పనిసరి’’ అని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ ఓ అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news