అవినాష్ ను అరెస్ట్ చేసేందుకు కేంద్ర బలగాలు రాలేదని పేర్కొన్నారు సజ్జల. అవినాష్ ను అరెస్ట్ చేసేందుకు కేంద్ర బలగాలు రావటం ఏంటి?? అని ఆగ్రహించారు. ఎంపీ అవినాష్ ఏమైనా దోషినా?? శిక్ష పడితే పారిపోతున్నాడా?? అని ప్రశ్నించారు. తనకు ఉన్న హక్కు ప్రకారం కోర్టును ఆశ్రయిస్తే ఏదో జరిగిందన్నట్లు ఎందుకు చెబుతున్నారని నిప్పులు చెరిగారు.
రామోజీ రావుకు, చంద్రబాబు కు ఒక న్యాయం… అవినాష్‌కు మరో న్యాయమా?? అని ఆగ్రహం వ్యక్తం చేశారు అవినాష్. ప్రపంచం తలకిందులు అయినట్లు ప్రాజెక్ట్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అవినాష్‌రెడ్డి ఇప్పటికే ఆరుసార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. తన తల్లి అనారోగ్యం కారణంగా అవినాష్‌రెడ్డి విచారణకు వెళ్లలేకపోతున్నారని చెప్పారు సజ్జల. తల్లి ఆరోగ్యం బాగా లేకపోతే.. నాటకాలు, డ్రామాలు అని ప్రచారం చేస్తారా. కేంద్రబలగాలు కూడా వచ్చా యని ప్రచారం చేస్తున్నారు. తన తల్లి ఆరోగ్యం బాగాలేదని సీబీఐకి కూడా తెలియజేశారని వివరించారు సజ్జల.