సిసోడియాను మెడ పట్టుకుని ఈడ్చుకెళ్లిన పోలీసులు…వీడియో వైరల్

-

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కు ఘోర అవమానం చోటు చేసుకుంది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను రౌస్ అవెన్యూ కోర్ట్ జ్యుడీషియల్ కస్టడీని జూన్ 1 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

అయితే సిసోడియాను కోర్టు నుంచి జైలుకు తరలించే క్రమంలో ఆయన పట్ల పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా ప్రశ్నలకు సిసోడియా సమాధానమిస్తుండగా… ఓ పోలీస్ అధికారి ఆయన మెడ పట్టుకొని ఈడ్చుకెళ్లిన వీడియో వైరల్ అవుతుంది. ఇక దీని పై ఆప్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ను ఇలా తీసుకెళ్లడం మేంటని నిప్పులు చెరుగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news