బంపర్ ఆఫర్ కొట్టేసిన కృతి శెట్టి.. కలిసొచ్చినట్టేనా..?

-

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మొదటి చిత్రంతోనే తన నటనతో చూపుతో అందరి మనసులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ క్రేజీతోనే వరుసగా అవకాశాలు కూడా క్యూ కట్టాయి. అలా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈమె ఆ తరువాత కథల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేసింది.

ఇకపోతే గత ఏడాది నాలుగు సినిమాలను రిలీజ్ చేయగా అందులో మూడు పూర్తి డిజాస్టర్ గా మిగలగా.. ఒక సినిమా మాత్రమే జస్ట్ ఓకే అనిపించుకుంది. ఇక ఇప్పుడు తాజాగా నాగచైతన్య సరసన కస్టడీ సినిమాలో నటించగా అది కూడా డిజాస్టర్ గా మారింది. కానీ ఆ సినిమా వల్లే ఈమెకు మరొక ఆఫర్ కలిసి వచ్చిందని చెప్పాలి. వెంకట ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతి శెట్టి నటించిన చిత్రం కష్టడి.. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది కానీ దర్శకుడు ఆమెకు మరొక అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది . దర్శకుడు వెంకట ప్రభు తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీలో విజయ్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించాల్సి ఉండగా అందులో ఒకరిగా కృతి శెట్టిని ఆయన ఎంచుకున్నట్లు సమాచారం.

ఇకపోతే కస్టడీ సినిమా సమయంలో తన నటనను మెచ్చిన వెంకట ప్రభు ఈ సినిమాలో ఒక అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం కృతి శెట్టి ఒక మలయాళ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. సూర్యబాల ప్రాజెక్టులో కూడా ఈమెని హీరోయిన్గా తీసుకోవడం గమనార్హం .ఇకపోతే తాజాగా ఇదే విషయాన్ని కృత్తి శెట్టి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ విజయ్ తో సినిమా చేయాలనే నా కోరిక నిజమైంది అంటూ ఆనందం వ్యక్తం చేసింది. మొత్తానికైతే కస్టడీ సినిమా ఈమెకు కలిసొచ్చినట్టే అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news