ముంబయి సెషన్స్ కోర్టు వ్యభిచారంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యభిచారం నేరం కాదు .. కానీ, బహిరంగ ప్రదేశాల్లో చేయడం మాత్రం నేరమేనని వెల్లడించింది. బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారం ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుందని న్యాయస్థానం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబయిలోని ములంద్ ప్రాంతంలో ఒక వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు 34 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో ఆమెను హాజరుపర్చగా, ఓ ఏడాది పాటు సంరక్షణ కేంద్రంలో ఉండాలని ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. దాంతో సెషన్స్ కోర్టులో ఈ తీర్పును ఆమె సవాల్ చేసింది.
ముంబయిలోని ఒక వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు 34 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ఆమెను హాజరుపర్చగా, ఓ ఏడాది పాటు సంరక్షణ కేంద్రంలో ఉండాలని తీర్పునిచ్చారు. దాంతో ఆమె సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. ఆ మహిళ కేసుపై విచారణ చేపట్టిన ముంబయి సెషన్స్ కోర్టు… ఆమెకు సంరక్షణ కేంద్రం నుంచి విముక్తి కల్పించాలని ఆదేశించింది.
బాధితురాలు మేజర్ అని, ఎలాంటి కారణం చెప్పకుండా ఆమెను నిర్బంధిస్తే ఆమె హక్కులకు భంగం కలిగించినట్టేనని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆమె బహిరంగ ప్రదేశంలో వ్యభిచారం చేసిందని పోలీసు నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఆమె నేరం చేసినట్టు కాదని వివరించారు.