ఐపీఎల్ 2023 ఫైనల్ కు ధోని సేన ఎంటర్ అయింది. క్వాలిఫైయర్-1 మ్యాచ్ లో గుజరాత్ పై చెన్నై 15 రన్స్ తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని GT చేదించలేకపోయింది. గిల్ 42, రషీద్ 30 రన్స్ తో రాణించిన GT 157 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. సీఎస్కే బౌలర్లలో చాహార్, తీక్షణ, జడేజా, పతిరన తలో 2 వికెట్లు, తుషార్ ఒక వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ లో గెలవడంతో చెన్నై ఫైనల్ కు చేరగా, ఎలిమినేటర్ లో గెలిచే జట్టుతో GT క్వాలిఫైయర్-2 లో తలపడనుంది. అయితే.. CSK vs GT మ్యాచ్ సందర్భంగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. 12వ ఓవర్ వేసిన తర్వాత పతిరన గ్రౌండ్ బయటకి వెళ్లి 16వ ఓవర్ కు ముందు మళ్ళీ వచ్చారు. నిబంధనల ప్రకారం బౌలింగ్ వేయడానికి ముందు బౌలర్ కచ్చితంగా 9 నిమిషాలు గ్రౌండ్ లో ఉండాలి. టైం సరిపోనందున అంపైర్లు బౌలింగ్ ను ఆపారు. దీంతో ధోని అంపైర్లతో వాగ్వాదం చేశారు. చివరి నాలుగు నిమిషాలు పాటు ఆగి మరీ పతిరనతో బౌలింగ్ వేయించారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి.