బన్నీ నెక్స్ట్ మూవీ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఎవరితో సినిమా చేస్తున్నారు? ఎప్పుడు సినిమా షూటింగ్ మొదలవుతుంది? అనే విషయాలు అభిమానులను రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మాటల మాంత్రికుడు గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని తెరకేక్కించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్లో మొదటిసారి జులాయ్ సినిమా రాగా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత అలవైకుంఠపురంలో సినిమా చేసి ఇండస్ట్రీ రికార్డులు సృష్టించారు.

ఇకపోతే అలవైకుంఠపురంలో సినిమా విడుదలైనప్పుడే అల్లు అర్జున్, త్రివిక్రమ్ మరో సినిమా చేస్తారు అని అప్పుడే తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా అదే సినిమాను వారు కన్ఫర్మ్ చేశారు. అయితే అలవైకుంఠపురంలో సినిమాను అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్, సూర్యదేవర రాధాకృష్ణకు చెందిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఈ రెండు సంస్థలు కలిసి ఇప్పుడు ఆ కొత్త సినిమాని నిర్మించబోతున్నాయని సమాచారం.

ఇక వచ్చే ఏడాది నుంచి సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా పూజా హెగ్డే , శ్రీ లీల కథనాయికలుగా త్రివిక్రమ్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శెరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్లు సమాచారం. ఇక తర్వాత అల్లు అర్జున్ కథపై త్రివిక్రమ్ పని మొదలు పెట్టబోతున్నారట. ఈ విషయం తెలిసి మరో హిట్ పక్కా అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news