నెట్​ఫ్లిక్స్ యూజర్స్​కు బ్యాడ్ న్యూస్.. ఇక నుంచి ‘నో పాస్‌వర్డ్‌ షేరింగ్’

-

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్ యూజర్స్​కు బ్యాడ్ న్యూస్ చెప్పింది. పాస్‌వర్డ్ షేరింగ్‌పై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం సమీప కుటుంబ సభ్యులతో మాత్రమే పాస్‌వర్డ్‌ను పంచుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. అలా కాకుండా ఇతరులతో పాస్‌వర్డ్‌ షేర్‌ చేసుకుంటే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన భారత్‌లో ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయంపై క్లారిటీ లేదు.

పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌ తమ యూజర్లకు ఈ-మెయిళ్లు పంపుతోంది. ఇంట్లోవారు కాకుండా బయటి వాళ్లను చేర్చుకోవాలంటే ఇకపై అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అమెరికాలో ఈ ఫీజును నెలకు 7.99 డాలర్లుగా నిర్ణయించింది. యూకేలో 4.99 యూరోలుగా తెలిపింది.

అసలు పాస్‌వర్డ్‌ కుటుంబ సభ్యులతోనే షేర్‌ చేస్తున్నామా? లేక ఇతరులతో కూడా పంచుకుంటున్నామా? అనే విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ ఎలా నిర్ధారిస్తుందని చాలా మందికి సందేహం కలుగుతోంది. ఐపీ అడ్రస్‌లు, డివైజ్‌ ఐడీలు, అకౌంట్‌ యాక్టివిటీ ఆధారంగా దీన్ని నిర్ధారిస్తామని కంపెనీ తెలిపింది. అయితే, యూజర్ల జీపీఎస్‌ డేటాను మాత్రం సేకరించబోమని స్పష్టం చేసింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news