ప్రభుత్వం రైస్ మిల్లర్ల చెప్పు చేతల్లో పనిచేస్తోంది – జీవన్ రెడ్డి

-

బిఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రైస్ మిల్లర్లు ప్రభుత్వ అధీనంలో పని చేస్తున్నారా..? ప్రభుత్వం రైతు మిల్లర్ల అధీనంలో పని చేస్తున్నారా..? అని విమర్శించారు. ప్రభుత్వం రైస్ మిల్లర్ల చెప్పు చేతల్లో పని చేస్తోందని ఆరోపించారు జీవన్ రెడ్డి. ప్రతి క్వింటాల్ కి ఐదు కిలోల దోపిడీ జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ రసీదు ఇవ్వడం లేదన్నారు. వరిధాన్యం కొనుగోలులో పచ్చిమోసం జరుగుతోందన్నారు జీవన్ రెడ్డి.

ఉమ్మడి రాష్ట్రంలో రైతులకి ఉన్న అన్ని రాయితీలు ఎత్తేసి కేవలం రైతు బంధు మాత్రమే ఇస్తున్నారని దుయ్యబట్టారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు రొడ్డేక్కుతున్నారని తెలిపారు. ప్రభుత్వంపై నమ్మకం లేక రైతులే మిల్లర్లతో మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్నికల సంవత్సరం కూడా ఇలా చేస్తున్నారంటే ప్రజల సంక్షేమంపై ప్రభుత్వ ఆలోచన ఎంటో అర్థం చేసుకోవచ్చన్నారు. రైస్ మిల్లర్లని అదుపు చేయకపోవడం ప్రభుత్వ అసమర్థత అన్నారు జీవన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news