టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి ఎపిసోడ్ పై స్పందించారు ఆమె న్యాయవాది పాల్ సత్యనారాయణ. డీసీపీ జంతువులను హింసిస్తుంటే డింపుల్ వారించిందని.. ఆ కక్షతోనే డింపుల్ పై ఫాల్స్ కేసు పెట్టారని అన్నారు. డింపుల్ ఎక్కడ కూడా కారుని తన్నిన ఫుటేజ్ లేదని తెలిపారు. డింపుల్ మీద నమోదైన ఎఫ్ఐఆర్ ఫాల్స్ ఎఫ్ఐఆర్ అని ఆరోపించారు. డేవిడ్, డింపుల్ ఇద్దరు డీసీపీ రాహుల్ కారు కవర్ కూడా తొలగించారని ఎఫైర్ లో ఉందని.. కానీ సీసీ ఫుటేజ్ లో అలాంటి విజువల్స్ లేవని వివరించారు.
డీసీపీ అయి ఉండి కూడా రాహుల్ మీడియా ముందు అబద్ధాలు ఆడుతున్నాడన్నారు. జంతువులతో మిస్ బిహేవ్ చేసినప్పుడు డింపుల్ అతనికి వార్నింగ్ ఇచ్చిందని.. తన పరువు పోతుందని ఇన్ని ఆరోపణలు ఆయన చేస్తున్నాడన్నారు. ఈ వివాదంతో డింపుల్ మెంటల్ స్ట్రెస్ కి గురైందన్నారు. ప్రస్తుతం ఆమె బయటికి వెళ్లడానికి భయపడుతుందని చెప్పుకొచ్చారు.