ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ వ్యవహారం.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

-

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఓవైపు తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్​పై విచారణ జరుగుతోంది. మరోవైపు ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ వ్యవహారంపై సుప్రీం కోర్టులోనూ మరోసారి విచారణ జరిగింది. గంగి రెడ్డి విడుదల అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.  

బెయిల్‌ మంజూరు చేయడంతో పాటు కస్టడీ తర్వాత విడుదల తేదీని ఖరారు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించారు.  సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) సంజయ్‌ జైన్‌ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేసి లొంగిపోవాలని చెబుతూనే.. ఆయన్ను జులై 1న విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు ఏప్రిల్‌ 27న జారీ చేసిన ఉత్తర్వులు 8వ వింతను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటిది తామెప్పుడూ వినలేదన్నారు. సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను తాము సమర్థిస్తున్నామని చెప్పారు. తాజాగా ఆ కేసును విచారించిన ధర్మాసనం.. గంగిరెడ్డి విడుదల అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news