యూట్యూబ్ లో “పల్సర్ బైక్” సాంగ్ కు పోటెత్తిన వ్యూస్…

రవితేజ మరియు శ్రీలీల హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం ధమాకా. ఈ సినిమాను నక్కిన త్రినాథరావు ఎంతో మాస్ మసాలా స్టైల్ లో తెరకెక్కించి తన కెరీర్ లో మరో హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాలో ఒక ప్రయివేట్ సాంగ్ ను కూడా వాడుకున్న సంగతి తెలిసిందే. రమణ అనే ఒక జానపద గాయకుడు ద్వారా వెలుగులోకి వచ్చిన పల్సర్ బైక్ సాంగ్ ను ఈ సినిమాలో ఉపయోగించారు. దీనికి రవితేజ మరియు శ్రీలీల డ్యాన్స్ తోడవడంతో ఈ పాటకు మంచి ఆదరణ దక్కుతోంది. ప్రస్తుతం యు ట్యూబ్ లో ఈ పాత రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది, తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ పాత యు ట్యూబ్ లో ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ ను అందుకుని సరికొత్త రికార్డ్ సృష్టించినట్లు చిత్ర బృందం ప్రకటించింది.

కాగా ఈ పాటను ఎక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగినా, లేదా టీవీ లలో ప్రోగ్రామ్స్ జరిగినా వాడుకుంటూ క్రేజ్ ను మరింత పెంచేస్తున్నారు.