జూన్‌ 4 మరో 4 కలెక్టరేట్లు ప్రారంభించనున్న కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రంగం సిద్ధం అవుతోంది. జూన్ 2వ తేదీ నుంచి 21 రోజుల వరకు ప్రతి రోజూ ఓ ప్రత్యేక దినంగా దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించి అన్ని శాఖలు ప్రణాళికలు రూపొందించాయి. దేశమంతా దద్దరిల్లేలా ఈ దశాబ్ది ఉత్సవాలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ మేరకు ఉత్సవాలపై ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులతో పలుదఫాలు సమీక్షలు కూడా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు.

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. ముఖ్యమంత్రి ·కేసీఆర్‌ వరుసగా జిల్లాల్లో పర్యటించనున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్న సమీకృత జిల్లా పాలనాసౌధాలు(కలెక్టరేట్లు) మరో నాలుగింటిని ఆయన ప్రారంభిస్తారు. సన్నాహాలు పూర్తయ్యాయి. జూన్‌ 4న(ఆదివారం) నిర్మల్‌, జూన్‌ 6న(మంగళవారం) నాగర్‌కర్నూల్‌, జూన్‌ 9న(శుక్రవారం) మంచిర్యాల, జూన్‌ 12న(సోమవారం) గద్వాలలో వాటిని కేసీఆర్‌ ప్రారంభిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news