పుట్టబోయే బిడ్డ గురించి హింట్ ఇచ్చిన ఇలియానా..!

-

గోవా బ్యూటీ స్టార్ హీరోయిన్ ఇలియానా గర్భం దాల్చిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడైతే ఆమె గర్భం దాల్చానని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిందో అప్పటి నుంచి పలు అనుమానాలు లేవనెత్తుతున్నాయి. గతంలో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో ప్రేమలో పడిన ఈమె ఆ తర్వాత మళ్లీ అతనితో కలిసి తిరుగుతున్నట్టు క్లారిటీ లేదు. కానీ ఇంతలోనే తాను ప్రెగ్నెంట్ అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఇన్స్టా లో చెప్పడంతో ఎవరూ నమ్మలేదు.. కానీ ఈసారి ఆమె ఏకంగా బేబీ బంప్ ప్రదర్శిస్తూ ఫోటోలు షేర్ చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

ఇక నిన్నటి కి నిన్న బ్లాక్ డ్రెస్ లో అద్దం ముందు సైడ్ యాంగిల్ లో బేబీ బంప్ చూపిస్తూ మాతృత్వాన్ని తెగ ఎంజాయ్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా పుట్టబోయే బిడ్డపై కూడా హిట్ ఇచ్చింది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇలియానాకు పుట్టబోయేది అమ్మాయి అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇలియానా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఒక సెల్ఫీ షేర్ చేశారు. అంతేకాదు హైలైట్ అయ్యేలా ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలకు ఇలియానా ” ఇట్స్ ఆల్ అబౌట్ ఏంజెల్స్” అంటూ కామెంట్ పెట్టింది.

ఆమె తనకు పుట్టబోయేది అమ్మాయని పరోక్షంగా తెలియజేసినట్లు కొంతమంది భావిస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసి మరికొంతమంది ఇలియానాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఒక ఆల్బమ్ చేసిన ఈమె తన బెల్లీ అందాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది .కానీ ఇటీవల హిప్ షేప్ కోల్పోయి దారుణంగా కనిపించడంతో ఆమెను ప్రతి ఒక్కరు ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెన్సీ అంటూ ప్రకటించి మరొకసారి వార్తల్లో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news