ఇంగ్లాండ్ లో దేశవాళీ లీగ్ విటాలిటీ బ్లాస్ట్ టీ 20 లు జరుగుతున్న విషయం తెలిసిందే. సర్రే తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాడు సీన్ అబాట్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. జట్టు అయిదు వికెట్లు కోల్పోయి కష్టాలలో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన అబాట్ తనదైన హిట్టింగ్ తో ఏకంగా బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డ్ సృష్టించాడు. ఇతని ఇన్నింగ్స్ సాగిన తీరు ఆ గ్రౌండ్ లో విద్వంసాన్ని సృష్టించిందని చెప్పాలి. పడిన బంతిని పడినట్లే స్టాండ్స్ లోకి కొడుతూ ప్రత్యర్థులకు చమటలు పట్టించాడు. ఇతని ఇన్నింగ్స్ లో 41 బంతులు ఆడి మొత్తం 11 సిక్సులు మరియు 4 ఫోర్ల సహాయంతో 110 పరుగులు చేశాడు. ఈ విద్వంసకర ఇన్నింగ్స్ తో సర్రే నిర్ణీత ఓవర్ లలో 223 పరుగులు చేసింది.
ఇంత భారీ స్కోరును చేధించలేక ప్రత్యర్థి జట్టు చతికిలబడడంతో సర్రే 41 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సెంచరీ తో సీన్ అబాట్ టీ 20 లలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన నాలుగవ ప్లేయర్ గా ఘనత సాధించాడు.