యూవీ క్రియేషన్స్ తో చేతులు కలిపిన రామ్ చరణ్… రేపే బిగ్ అనౌన్స్మెంట్ !

-

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇప్పటికే హీరోగా తానేమిటో నిరూపించుకుని తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకపక్క హీరోగా చేస్తూనే సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ మరియు యూవీ క్రియేషన్స్ లాంటి బడా నిర్మాణ సంస్థ తో కలిసి మరో నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ రేపు ఉదయం 11.11 గంటలకు పోస్టర్ ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ కొన్ని సినిమాలను నిర్మించి మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు యూవీ క్రియేషన్స్ కు చెందిన విక్రమ్ తో కలిసి V మెగా పిక్చర్స్ అనే సంస్థను నెలకొల్పనున్నారు. దీనికి తోడు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి సినిమాలను అందించనున్నారు. మరి ఇది సక్సెస్ కావాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news