BREAKING : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రేపట్నుంచి ఏపీలో భూముల ధరలు పెరగనున్నాయి. భూముల ధరలను పెంచే దిశగా ఏపీ ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. భూముల ధరలను పెంచబోతున్నట్టు ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్లకు.. సబ్ రిజిస్ట్రార్లకు అనధికారిక సమాచారం ఇప్పటికే ఇచ్చింది. భూముల ధరల పెంపునకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలని రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కాకుండా కొన్ని చోట్లే భూముల ధరలను పెంచాలనే సూచనలు చేశారు. ఎక్కడైతే రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎక్కువ జరుగుతాయో.. ఆ ప్రాంతాల్లో భూముల ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. 10-15 శాతం మేర భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తోంది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఉత్తర్వులు విడుదల చేయనున్నారు ఉన్నాతాధికారులు.