సినిమా ప్రియులకు ఏపీ సర్కార్‌ శుభవార్త.. ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రారంభం

-

సినిమా ప్రియులకు ఏపీ సర్కార్‌ శుభవార్త చెప్పింది. ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమాన్ని ప్రారంభించింది ఏపీ సర్కార్. ఇవాళ ఫస్ట్ డే ఫస్ట్ షో ద్వారా కొత్త సినిమా కాన్సెప్ట్ తీసుకుని వచ్చింది ఏపీ ఫైబర్. విశాఖలో ఈ కార్యక్రమాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు.

మొదటి సినిమాగా నిరీక్షణ ఫైబర్లో విడుదలయింది. ఈ కార్యక్రమంలో సినిమా పరిశ్రమ నుంచి నిర్మాత సి. కళ్యాణ్, రామనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో సుమారు 1200 థియేటర్లు ఉంటే నాలుగైదు సినిమా హౌస్ ల చేతుల్లోనే ఉండిపోయాయన్నారు.

ఇప్పుడు వంద రోజుల సినిమా అనే కాన్సెప్ట్ లేకుండా పోయింది…ఎంత పెద్ద కాస్టింగ్ వున్నా కంటెంట్ లేకపోతే ఆదరణ లభించడం లేదని వెల్లడించారు. మంచి సినిమాలు కూడా ఓటీటీలకు పరిమితం కావాలిసి వస్తోందని.. చిన్న సినిమాలకు, నిర్మాతలకు సహకారం అందించేందుకు ఫస్ట్ డే-ఫస్ట్ షో విడుదల కాన్సెప్ట్ ఉపయోగపడుతుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news