తెలంగాణను జనం గర్వించే స్థాయికి తెచ్చిన నా జీవితం ధన్యమైంది: కేసీఆర్‌

-

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు సచివాలయం వేదికగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సచివాలయంలో జెండా ఆవిష్కరించిన అనంతరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానంపై ప్రసంగించారు. 2014 జూన్ 2న సీఎంగా తాను చేసిన వాగ్దానాన్ని నిలుపుకున్నానని తెలిపారు. పదేళ్ల క్రితం తెలంగాణను చూసి దేశం నేర్చుకునేలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చానని.. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నానని అన్నారు. రాష్ట్రాన్ని జనం గర్వించే స్థాయికి తెచ్చిన తన జీవితం ధన్యమైందని చెప్పారు. రాష్ట్రం అందుకోవాల్సిన శిఖరాలు మరెన్నో ఉన్నాయన్న కేసీఆర్.. సత్తువ ఉన్నంతవరకు రాష్ట్ర ప్రగతి కోసం శ్రమిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. దశాబ్ది ముంగిట నిలిచిన రాష్ట్రానిది విప్లవాత్మక విజయ యాత్ర అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

“తెలంగాణ అవతరణ, దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి 21 రోజులపాటు గ్రామం నుంచి రాష్ట్ర రాజధాని వరకు ప్రజలంతా ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొనాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news