రైలు ప్రమాద సంఘటనపై బండి సంజయ్ కీలక ప్రకటన

-

ఒడిస్సా లో జరగిన రైలు ప్రమాద సంఘటనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సూచన మేరకు రైలు ప్రమాద మృతుల సంతాప సూచకంగా తెలంగాణలో నేడు జరగాల్సిన ‘‘మహజన్ సంపర్క్ అభియాన్’’ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు బండి సంజయ్.

అలాగే, నేడు కేంద్ర మంత్రుల, జాతీయ నాయకుల తెలంగాణ రాష్ట్ర పర్యటనలు కూడా రద్దు అయ్యాయి. రైలు ప్రమాద మృతులకు సంతాప సూచకంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నివాళులు అర్పించనున్నారు బీజేపీ నేతలు. ఒడిశాలో ఘోర రైలు ప్రమాద దుర్ఘటనపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి చేశారు. రైలు ప్రమాద మృతులకు సంతాపం ప్రకటించిన బండి సంజయ్… క్షత గాత్రులు కోలుకోవాలని విన్నివించారు.

Read more RELATED
Recommended to you

Latest news