సెంగోల్ రాజదండం.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో నిఖిల్ స్వయంభు.. హిట్ కొట్టినట్టేనా.?

-

సెంగోల్ రాజదండం.. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతోంది. చరిత్రలో రాజ్యాధికారం మార్పిడికి చిహ్నంగా వాడే ఈ దండం తాజా జరిగిన పార్లమెంట్ ఓపెనింగ్ కార్యక్రమంలో కూడా చాలా ఏళ్ల తర్వాత కనిపించి హాట్ టాపిక్ గా నిలిచింది. వేద పండితులు మఠాధిపతుల చేతుల్లో నుంచి ప్రధానమంత్రి మోడీ చేతుల్లోకి మారి పార్లమెంటులోని ఒక మూలన ప్రతిష్టించబడిన ఈ సెంగోల్ రాజదండం ఇప్పుడు అందరి నోట నానుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజల అటెన్షన్ ను మరింతగా దృష్టిలో పెట్టుకొని తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు నిఖిల్. ఈ క్రమంలోనే తాజాగా ఈ రాజదండం చుట్టూ కథ సాగేలా తన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

కార్తికేయ 2 సినిమాతో త్రూ అవుట్ ఇండియా పాపులర్ అయిన నిఖిల్ సిద్ధార్థ ఇప్పుడు తాజాగా వారియర్ గా మన ముందుకు వస్తున్నారు. భరత్ కృష్ణమాచార్య దర్శకత్వంలో హిస్టారికల్ కథాంశంతో అన్ సంగ్ రూరల్ స్వయంభు గా మన ముందుకు వస్తున్నారు నిఖిల్. తాజాగా తన బర్త్డే సందర్భంగా మోషన్ పోస్టర్ నా రిలీజ్ చేయగా అందులో చోళ రాజ్యపు జెండా రెపరెపలాడుతుండగా యుద్ధ వీరుడుగా కనిపించిన నిఖిల్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.

ఒక చోళ రాజు స్వయంభూగా తన రాజ్యాన్ని ఎలా నిర్మించారు అన్న కథాంశంతో ఈ సినిమా రాబోతోందని వార్త వినిపిస్తోంది. ఇకపోతే మూవీ పోస్టర్తో పాటు రెండు రోజుల ముందు రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందులో నరేంద్ర మోడీ చేతుల్లో కనిపించిన రాజదండం లాంటి దండం ఉండడం.. అది కూడా చోళ రాజుల వల్లే మునుగోడులోకి వచ్చిందనే ఒక చారిత్రక నిజం ఉండడంతో స్వయంభుగా ఈ కథను తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమాతో కచ్చితంగా నిఖిల్ హిట్ కొడతాడని నమ్మకం కూడా ఇప్పుడు అందరిలో కలిగిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news