పెళ్లి కుదిరితే నేనే చెప్తా : కీర్తిసురేష్

-

మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈమె ఇప్పుడు నిత్యం గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందులో డి గ్లామరస్ పాత్ర పోషించి మరింతగా ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తరచూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై హెడ్లైన్స్ లో నిలుస్తోంది.

అయితే తాజాగా దసరా మూవీతో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ కీర్తి సురేష్… తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గత కొన్ని రోజులుగా కీర్తి సురేష్ పెళ్లిపై అనేక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పెళ్లి గురించి ఎవరు ఆందోళన చెందనవసరం లేదని… పెళ్లి ఫిక్స్ అయితే నేనే స్వయంగా చెబుతానంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది కీర్తి సురేష్.

Read more RELATED
Recommended to you

Latest news