కేంద్రం ఎన్నో రకాల స్కీముల ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ తో చక్కటి లాభాలని పొందవచ్చు. లోన్స్ ని కూడా ఇస్తోంది కేంద్రం ప్రజలకు రుణ సహాయం అందించడానికి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముద్రా స్కీమ్ ని తీసుకు వచ్చింది. ముద్ర రుణ పథకం కింద మీరు రూ.10 లక్షల వరకు రుణం వస్తోంది. పూర్తి వివరాలు లోకి వెళితే… వాణిజ్య బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఎంఎఫ్‌ఐలు, ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా లోన్స్ ని ఇస్తున్నారు. సమీపం లోని బ్యాంకుకు వెళ్లి ఈ లోన్ స్కీమ్‌కు సంబంధించిన దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేయాల్సి వుంది. అవసరమైన అన్ని పత్రాలను కూడా ఇవ్వాల్సి వుంది. ఆన్‌లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రధాన్ మంత్రి ముద్రా యోజన ప్రయోజనాన్ని పొందడానికి మీరు ముందుగా అధికారిక వెబ్‌సైట్ udyamimitra.inని సందర్శించండి. ఆ తరవాత హోమ్ పేజీ లో ముద్ర లోన్ కోసం దరఖాస్తు లింక్ పై క్లిక్ చేయండి. SMS ద్వారా మీ ఫోన్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ వచ్చేస్తాయి. అవసరమైన అన్ని పత్రాలను కూడా ఇవ్వాల్సి వుంది. తర్వాత పూర్తిగా దరఖాస్తు ఫారమ్ నింపండి. డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ వంటివి అవసరం అవుతాయి. యుటిలిటీ బిల్లు కూడా ఉండాలి. మీ కుల ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాలి. లోన్ కోసం 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కూడా సబ్మిట్ చేయాల్సి వుంది. వ్యాపారం, చిరునామా, వ్యాపారానికి సంబంధించిన ఏదైనా రుజువును కూడా ఇచ్చేయాలి. ఇలా వీటి తో మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సులభంగా లోన్ ని పొందవచ్చు. గరిష్టంగా రూ. 10 లక్షల వరకు రుణం పొందవచ్చు.