‘మిర్రర్‌’ ఫోన్‌ హ్యాకింగ్‌ కేసు విచారణ.. కోర్టుకు హాజరైన ప్రిన్స్‌ హ్యారీ

-

బ్రిటన్‌ రాజకుటుంబ చరిత్రలో మరో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గత 130 ఏళ్లలో తొలిసారిగా ఈ రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం రోజున కోర్టుకు హాజరయ్యారు. ఫోన్‌ హ్యాకింగుకు సంబంధించిన కేసులో ‘మిర్రర్‌’ వార్తాసంస్థకు వ్యతిరేకంగా కింగ్‌ ఛార్లెస్‌-3 రెండో తనయుడు ప్రిన్స్‌ హ్యారీ (38) సాక్ష్యం చెప్పారు.

బ్రిటన్‌కు చెందిన ‘మిర్రర్‌’ గ్రూప్‌ న్యూస్‌పేపర్స్‌ (ఎంజీఎన్‌) అనేకమంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకుగాను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఫోన్‌ హ్యాకింగ్‌ ఆరోపణలకు సంబంధించి ప్రిన్స్‌ హ్యారీతోపాటు వంద మందికి పైగా ప్రముఖులు కోర్టులో దావా వేశారు. దీనిపై లండన్‌ హైకోర్టు విచారణ చేపట్టగా.. ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు హ్యారీ న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. భార్య మేఘన్‌ మర్కెల్‌, పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్న ప్రిన్స్ హ్యారీ సోమవారం లండన్‌కు చేరుకొని, మరుసటిరోజు హైకోర్టుకు వచ్చారు. బైబిల్‌పై ప్రమాణం చేశాక తన వాదన వినిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news