తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. 2023-24 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది తెలంగాణ పాఠశాల విద్యాశాఖ. మొత్తం 229 పని దినాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 23వ తేదీ చివరి పనిదినం కానుందని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
అక్టోబర్ 13 నుండి 25 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. జనవరి 12 నుండి 15 వరకు సంక్రాంతి సెలవులు ఉందనున్నాయి. రానున్న విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో నాలుగో శనివారాన్ని ‘నో బ్యాగ్ డే’ గా పాటించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు 2023-24 షెడ్యూల్ విడుదల చేసింది. రోజు అరగంట పుస్తకాలను చదివించాలని వారానికి 3-5 పీరియడ్లు ఆటలకు కేటాయించాలని సూచించింది. కాగా, దసరా సెలవులు 14 రోజులు ఉండగా, ఈసారి 13 రోజులు ఇచ్చారు. క్రిస్మస్ సెలవులు 7 నుంచి ఐదుకు తగ్గించారు.