ఒడిశా రైలు ప్రమాదం.. సిగ్నల్‌ వైఫల్యం వల్ల కాకపోవచ్చు : రైల్వే అధికారి

-

యావత్‌ దేశాన్ని పెను విషాదంలోకి నెట్టేసిన ఒడిశా రైలు ప్రమాద ఘటనకు అసలైన కారణాలు మాత్రం తెలియడం లేదు. సిగ్నలింగ్ వ్యవస్థలో వైఫల్యం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ నివేదిక తెలిపింది. అయితే తాజాగా దర్యాప్తు బృందంలో ఒక సీనియర్ రైల్వే ఇంజినీర్ మాత్రం.. ఈ ఘటనకు సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం అసలు కారణం కానే కాదని తేల్చి చెబుతున్నారు.

‘‘మెయిన్‌లైన్‌లో నుంచి లూప్‌లైన్‌లోకి వెళ్లేందుకు కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌కు సిగ్నల్‌ ఇచ్చారు. బహానగా బజార్‌ స్టేషన్‌కు చెందిన పాయింట్‌ నం.17ఏ ‘రివర్స్‌’ కండిషన్‌లో ఉంది. ఈ పాయింట్ ‘రివర్స్‌’లో ఉందంటే.. దాని అర్థం లూప్‌లైన్‌లోకి వెళ్లాలని..! అదే ఈ పాయింట్‌ ‘నార్మల్‌’లో ఉంటే.. రైలు మెయిన్‌లైన్‌ మీదుగానే వెళ్తుంది. దీంతో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ లూప్‌లైన్‌లోకి వెళ్లి ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొంది’’ అని ఈ ప్యానెల్‌లోని నలుగురు సభ్యులు నివేదికలో పేర్కొన్నారు.

ఈ ప్యానెల్‌లోని ఐదో వ్యక్తి అయిన సిగ్నల్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ ఏకే మహంత మాత్రం.. ‘‘పాయింట్‌ నం. 17ఏను రివర్స్‌ కండిషన్‌లో సెట్‌ చేసి ఉందంటే నేను అంగీకరించను. డేటాలాగర్‌ రిపోర్ట్‌ ప్రకారం.. ఈ పాయింట్‌ ‘నార్మల్‌’లోనే ఉందని మా విభాగం పరిశీలనలో తేలింది. రైలు పట్టాలు తప్పిన తర్వాత ఈ పాయింట్‌ ‘రివర్స్‌’లోకి మారిపోయి ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news