ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో తాను, సౌమ్య, ధీమా, అహంకారం తో గెలుస్తామనే బలుపుతో ఓడిపోయామంటూ హాట్ కామెంట్స్ చేశారు. పసుపు, కుంకుమ ఇచ్చాం కదా అని వీర తిలకాలు దిద్ది ఊరేగిస్తూన్నారని ఊరేగాం వైసిపి ఎమ్మెల్యేలు కాళ్ళు గడ్డాలు పట్టుకొని గెలిచారని… మైలవరం లో తండ్రి కొడుకులు, నందిగామ లో వసూలు బ్రదర్స్ కొండలు గుట్టలు దోచుకున్నారని మండిపడ్డారు.
ఇసుక విషయం నందిగామ, మైలవరం , జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యే లు నెలకు 7 కోట్లు పంపిస్తున్నారని.. మొన్నటి వరకు మైలవరం ఎమ్మెల్యే ఇసుక కోసం నెలకు 7కోట్లు పంపాడని ఆరోపణలు చేశారు. ఇప్పుడు నందిగామ వంతు రావడం తో 7కోట్ల ఇసుక సొమ్ము తాడేపల్లి కి పంపుతున్నారని… దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. నందిగామ లో నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం లో మాజీ ఎమ్మెల్యే సౌమ్య తో కలిసి పాల్గొన్నారు ఉమ. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమ.